జాన్వీ హిడెన్ టాలెంట్ ఇదే.. నెటిజన్ల ట్రోలింగ్

07-10-2026 | 05:37pm

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం పారిస్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తనలోని ఓ విచిత్రమైన టాలెంట్ గురించి చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటని అడిగినప్పుడు.. తాను నాలుకను దాదాపు 360 డిగ్రీలు తిప్పగలనని జాన్వీ సరదాగా వెల్లడించారు. అయితే దీనిని తానే పెద్దగా ఉపయోగం లేని టాలెంట్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. స్కూల్‌ రోజుల్లో ఈ ట్రిక్‌ను నేర్చుకున్నట్లు వివరించారు. 

జాన్వీ చెప్పిన ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెను సరదాగా ట్రోల్ చేస్తుండగా.. మరికొందరు ‘ఇది టాలెంట్ ఎలా అవుతుంది?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆమె నటనపై ఫోకస్ చేయాలని సూచిస్తూ సెటైరికల్ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ లుక్‌లతో పాటు.. ఆమె చెప్పిన ఈ విచిత్రమైన హిడెన్ టాలెంట్ కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు