ఓటీటీలోనూ గ్లోబల్ హవా!
ఇరుముడికి ఇంత క్రేజా?.. నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్‌గా దుమ్మురేపుతోంది!
థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ఇరుముడి’(Irumudi movie) ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ తన సత్తా చూపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత సినిమా వ్యూయర్‌షిప్ భారీగా పెరగడంతో గ్లోబల్ లెవల్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం Netflix(Ravi Teja Netflix movie) నాన్-ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. భారత్‌తో పాటు మరో 11 దేశాల్లో టాప్-10 మూవీస్‌లో ఇరుముడి చోటు దక్కించుకుంది.
ఇప్పటికే థియేట్రికల్ రన్‌లో రూ.250 కోట్లకు పైగా వసూళ్లు(Irumudi movie collections) సాధించిన ఈ సినిమా.. ఓటీటీ ఎంట్రీతో మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లలో చూసిన ప్రేక్షకులతో పాటు ఓటీటీలో కొత్త ఆడియన్స్‌ను కూడా సినిమా ఆకట్టుకుంటున్నట్లు ట్రెండింగ్(Irumudi OTT trending) చూస్తే అర్థమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ ప్రధాన పాత్రలో నటించగా, ప్రియ భవానీ, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ అదే జోరు కొనసాగడంతో ‘ఇరుముడి’ డిజిటల్ రన్‌పై ఆసక్తి పెరుగుతోంది.
‘ఇరుముడి’ తాజా బాక్సాఫీస్ వసూళ్లు: సెప్టెంబర్ 24 నాటికి Sacnilk గణాంకాల ప్రకారం, భారత్‌లో రూ.190.10 కోట్లు నెట్, రూ.220.81 కోట్లు గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.22.45 కోట్లు గ్రాస్ వసూలయ్యాయి. ఇరుముడి రూ.250 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ సాధించింది.