ద ఎర్త్‌షాట్ ప్రైజ్ అవార్డ్స్ నైట్‌కు తరలిరానున్న తారలు
ముంబై, ఇండియా, అక్టోబర్ 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారం ద ఎర్త్‌షాట్ ప్రైజ్(Earthshot Prize), 2026 నవంబర్ 17న ముంబయిలో జరగనున్న తన 2026 అవార్డ్స్ నైట్ వేదికపై సందడి చేయనున్న సంగీతం, ఫ్యాషన్, సినిమా, క్రీడా రంగాలకు చెందిన అంతర్జాతీయ తారల పేర్లను ఈరోజు వెల్లడించింది.
పర్యావరణ నాయకత్వాన్ని గౌరవించే ఈ చారిత్రక వేడుకలో ముంబయిలో 5,000 మంది ప్రముఖ అతిథులతో పాటు, సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), ఆలియా భట్, రామీ మాలెక్, శ్రేయా ఘోషల్, సోనమ్ కపూర్, సిమోన్ యాష్లీ కూడా అవార్డ్స్ నైట్ వ్యాఖ్యాత కరణ్ జోహార్, ఎర్త్‌షాట్ అంబాసిడర్లు రాబర్ట్ ఇర్విన్, నొమ్జామో ఎంబాతాలతో కలిసి పాల్గొంటారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తున్న ఈ అవార్డ్స్ నైట్‌లో పాల్గొనబోయే మరికొందరు తారల పేర్లను రాబోయే వారాల్లో ప్రకటిస్తారు.
చరిత్రలో తొలిసారిగా, ప్రత్యేక స్ట్రీమింగ్ భాగస్వామి అయిన ప్రైమ్ వీడియో ద్వారా నవంబర్‌లో 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లో 40కి పైగా భాషల్లో ఈ అవార్డ్స్ నైట్ మునుపెన్నడూ లేనంత మంది అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరనుంది.2020లో ప్రిన్స్ విలియం స్థాపించిన ద ఎర్త్‌షాట్ ప్రైజ్, పదేళ్ల పర్యావరణ కార్యాచరణకు నేతృత్వం వహిస్తోంది. మన భూగ్రహం ఎదుర్కొంటున్న అత్యంత అత్యవసర సవాళ్లకు పరిష్కారాలు కనుగొంటున్న శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, సమాజంలో మార్పు తెస్తున్నవారు, ఆదివాసీ నాయకులు, యువ ఆవిష్కర్తలు - ద ఎర్త్‌షాట్ ప్రైజ్‌కు కేంద్ర బిందువుగా ఉన్న ఈ అద్భుతమైన వ్యక్తులను అవార్డ్స్ నైట్ సత్కరించనుంది.
భారతదేశంలోని ప్రముఖ దర్శకనిర్మాతలు, వ్యాపారవేత్తలు, బ్రాడ్కాస్టర్లలో ఒకరైన, ప్రైమ్ వీడియో ప్రసారం చేస్తున్న ‘ద ట్రెయిటర్స్ ఇండియా’ సహా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ మాట్లాడుతూ “ముంబయిలో ద ఎర్త్‌షాట్ ప్రైజ్ అవార్డులకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం నాకు ఎంతో గర్వకారణమైన గౌరవం. ద ఎర్త్‌షాట్ ప్రైజ్ గురించి ప్రిన్స్ విలియం దార్శనికత, ఆశ, ఆవిష్కరణ, తక్షణ కార్యాచరణలతో కూడిన ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని రగిలించింది. అపారమైన సృజనాత్మకత, పట్టుదల కలిగిన భారతదేశం ఆ లక్ష్యానికి సరైన వేదికగా చెప్పుకొచ్చారు.
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెటర్లలో ఒకరు, దీర్ఘకాలంగా సామాజిక కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్న సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ “ఒకే లక్ష్యంతో, మార్పు తేవాలనే సంకల్పంతో ప్రజలు ఏకమైనప్పుడే ఎన్నో పెద్ద సవాళ్లను అధిగమించగలం. మన భూగ్రహం కోసం సరిగ్గా అదే చేస్తున్న - సాహసోపేతమైన ఆలోచనలను అర్థవంతమైన కార్యాచరణగా మారుస్తున్న - వ్యక్తులను ద ఎర్త్‌షాట్ ప్రైజ్ సత్కరిస్తుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు శాశ్వత మార్పు తేగల పరిష్కారాలను రూపొందిస్తుండటం స్ఫూర్తిదాయకమన్నారు.
ఆదివాసీ, సమాజ జ్ఞానం నుంచి కార్పొరేట్ విజయగాథలు, ఏఐ ఆధారిత క్లైమేట్ టెక్ వరకు, ఈ ఏడాది 15 మంది ఎర్త్‌షాట్ ఫైనలిస్టులు ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన వాతావరణ నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవార్డ్స్ నైట్‌లో ఐదు అవార్డు విభాగాల్లో ఐదుగురు విజేతలను ప్రకటిస్తారు. తమ పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లేందుకు లేదా విస్తరించేందుకు ఒక్కొక్కరు £1 మిలియన్ బహుమతి అందుకుంటారు. ద ఎర్త్‌షాట్ ప్రైజ్ వ్యవస్థాపక భాగస్వామిగా, అత్యవసర ఆశావాదం అనే సందేశాన్ని ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేర్చడంలో అమెజాన్ తోడ్పాటు అందిస్తోంది.