జిల్లాలోని పలు... డివిజన్లకు కాంగ్రెస్ కమిటీల ప్రకటన

16-10-2026 | 08:04pm
  1. జిల్లాలో కాంగ్రెస్ బలోపితానికి కృషి చేయండి.                                   
  2. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు.              

జవహర్ నగర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి డివిజన్ కమిటీలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపితం చేయడం ప్రజలతో మరింత సన్నిహితంగా పని చేయాలని తెలిపారు.

ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు  పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ పదవులు బాధ్యతకు ప్రతీకలని ప్రజాసేవే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం వివిధ డివిజన్ల ప్రతి నిధులను ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, బోడుప్పల్ మాజీ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బొమ్మ కళ్యాణ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి, జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శాంతి కోటేష్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, నూతన కమిటీ సభ్యులు ఉన్నారు. వజ్రేష్ యాదవ్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపితం చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు.

మరిన్ని వార్తలు