క్రీడలు యువతలో ఉల్లాసాన్ని కలగజేస్తాయి

16-10-2026 | 09:48pm

మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి.

తుంగతుర్తి( విజయ క్రాంతి): క్రీడలు యువతలో ఉల్లాసాన్ని కలగజేస్తాయి, ఉన్నతమైన ఉద్యోగాలు పొందడానికి అవకాశం కలిగి ఉన్నాయని తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల రెడ్డి(Tungaturthi Market Chairman Teegala Reddy) అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం,నూతనకల్లు మండల కేంద్రం లో శుక్రవారం క్రికెట్ ఆట పోటీలను ప్రారంభించి మాట్లాడారు. నేడు గ్రామీణ క్రీడాకారులు ఎంతోమంది, ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం మన దేశానికి గర్వకారణం అని అన్నారు.

యువత చదువుతోపాటు క్రీడలో రాణించినప్పుడే గ్రామాలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి  , స్థానిక ఎస్సై నాగరాజు  స్థానిక సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున . కాప రవి,రాజబహుదూర్ రెడ్డి, ఇతరులు  నిర్వాహకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు