పారిశుధ్య కార్మికులకు దసరా కానుకల పంపిణీ

16-10-2026 | 08:57pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): దసరా పండుగను(Dasara Festival) పురస్కరించుకొని రాజంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో(Rajampet Gram Panchayat Office) పారిశుధ్య కార్మికులకు దుస్తులు, చెప్పులు, సబ్బులు, నూనె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివిజనల్ పంచాయతీ అధికారి ఒమర్ హుస్సేన్ కార్మికులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని కొనియాడారు.

వారి సేవలను గుర్తించి పండుగ వేళ అవసరమైన వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్స పోచయ్య, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, వార్డు సభ్యులు బుర్స నిర్మల, బొట్టుపల్లి లావణ్య, గులాం జావేద్, జాబిరి కిషోర్, బుర్స భూపతి, పంచాయతీ కార్యదర్శి జె. సాయికృష్ణ, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు