బొల్లారం పరిశ్రమలో కార్మికుడి మృతి
16-10-2026 | 09:41pm
జిన్నారం అక్టోబర్ 16: జిన్నారం మండలం బొల్లారంలో శ్రీకృష్ణ స్టీల్ పరిశ్రమలో బిహార్ కి చెందిన ఒక కార్మికుడు నిన్న గురువారం ఉదయం తన విధులు నిర్వహిస్తుండగా సద్దాం అన్సారి (35) పరిశ్రమలో స్టీల్ రాడ్ తలకి తగిలి బలమైన గాయం కావడంతో కింద పడి తీవ్ర గాయాలు కావడంతో పటాన్చెరువు ఆసుపత్రికి తరలించారు ప్రమాదవశాత్తు సద్దాం అన్సారి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నీ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.