భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు కుంకుమార్చన.. పల్లకి సేవ

16-10-2026 | 09:46pm
  1. ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
  2. సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు

పాపన్నపేట,అక్టోబర్16: పాపన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Sharannavaratri Celebrations) ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం పాపన్నపేటలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా.. యూసుఫ్ పేటలో అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భజన పాటలతో భక్తుల జయ జయ ద్వానాల నడుమ అమ్మవారి పల్లకి సేవ కన్నుల పండువగా సాగింది. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృపాకటాక్షాలు పొందారు.

మరిన్ని వార్తలు