మెడికల్ సీట్లు సాధించిన విజ్డమ్ పూర్వ విద్యార్థులు
16-10-2026 | 09:38pm
కొడిమ్యాల, అక్టోబర్ 16 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విజ్డమ్-విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో (Wisdom-Vidya Bharati English Medium School)పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు దీకొండ కార్తీక్, పిండేరు సాత్విక్ విద్యార్థులు నీట్ పరీక్ష లో అర్హత సాధించి,మెడిసిన్ లో దీకొండ కార్తీక్ రాజీవ్ గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆదిలాబాద్ లో, పిండేరు సాత్విక్ మహావీర్ వైద్య కళాశాల వికారాబాద్ లో ఎంబిబిఎస్ సీట్లు సాధించారు.వీరు ఇద్దరూ మొదటి ప్రయత్నంలోనే మెడిసిన్ లో సీట్లు సాధించడం పట్ల విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.