ఘనంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బర్త్ డే సెలబ్రేషన్స్

21-09-2026 | 03:20pm

లక్షేట్టిపేట, సెప్టెంబర్ 21(విజయక్రాంతి ): మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు(Prem Sagar Rao) 67 వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.సోమవారం పట్టణంలోని స్థానిక ఐబీ విశ్రాంత భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోనే నియోజకవర్గం అభివృద్ధిలో ప్రథమ స్థానంలో దూసుకెళ్ళుతుందన్నారు.

రెండున్నర ఏండ్లలో సుమారు రూ. 2 వేల కోట్లతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యంగా మంచిర్యాలలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్, స్మశాన వాటిక, రోడ్డు వెడల్పు పనులు, లక్షేట్టిపేటలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, 30 పడకల ఆసుపత్రి, దండేపల్లి మండలంలో ఇంటిగ్రెటెడ్ స్కూల్,హజిపూర్ మండలంలో ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్, ఐటీ పార్క్ లాంటి అనేక అభివృద్ధి జరుగుతున్నాయని వివరించారు. అదే విధంగా లక్షేట్టిపేటలోని మండల అంబేద్కర్ సంఘం భవన నిర్మాణానికి రూ. 15 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో భాగంగా రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు.పాత బస్టాండ్ ఏరియాలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జెండా వెంకటాపూర్ పీఏసీఎస్ చైర్ పర్సన్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు షాహిద్ అలీ, నలిమేల రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ చైర్మన్ ఆరీఫ్, సర్పంచ్ లు దుమ్మని సత్తయ్య, రాందాస్, కౌన్సిలర్లు పద్మ రమేష్,చంద్రమౌళి,శనిగారపు చిన్నయ్య,నాయకులుఅశోక్,కాంతయ్య,రాందేని వెంకటేష్,కందుల మెహన్,మడిపెల్లి స్వామి, సురేష్,శ్రీధర్,కో- ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు