ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ 157వ జయంతి(Mahabubnagar)ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్(Additional Collector Madhusudhan Nayak), మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి(Municipal Commissioner Ramanjula Reddy) పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ చేసిన సేవలను, ఆయన అనుసరించిన సత్యం, అహింస మార్గాలను స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ స్వచ్ఛమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.