సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలి

16-09-2026 | 01:21pm

ఆసిఫాబాద్, సెప్టెంబరు 16(విజయ క్రాంతి): సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి(AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆసిఫాబాద్ ఎంఎల్‌ఎస్ గోదాంలో హమాలీల సమావేశం నిర్వహించారు. పెరిగిన వేతనాలను అమలు చేయాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని కోరారు.

ఈ నెల 18న హైదరాబాద్‌లోని సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని హమాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హమాలీలకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి. సుధాకర్, శ్రీనివాస్, తుకారం, మోహన్, ప్రకాష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు