గిరిజన తండాల్లో కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా క్షీరాభిషేకం
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలంలోని పలు గిరిజన తండాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చిత్రపటానికి ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ల పెంపు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం, గిరిజన భవన్ నిర్మాణం వంటి చర్యలు కేసీఆర్ హయాంలో జరిగాయని తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గిరిజనులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తండాల అభివృద్ధికి గతంలో చేసిన కృషిని నాయకులు వివరించారు. రానున్న కాలంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, కందాళ ఉపేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.