సెప్టెంబర్‌ 17 విద్రోహమే

17-09-2026 | 09:46pm

ఆలేరు,(విజయక్రాంతి): 1948 సెప్టెంబర్‌ 17ను విలీనం, విమోచన దినం(Telangana Liberation Day)గా పేర్కొనడం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించడమేనని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్‌.జనార్ధన్‌(CPI ML New Democracy District Secretary R. Janardhan) అన్నారు. సెప్టెంబర్‌ 17 విలీనమా.. విమోచన అనే అంశంపై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నైజాం పాలనకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు సాగించిన పోరాటాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. డివిజన్‌ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో అమరవీరులకు రెండు నిమిషాలు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కుల, మతాలకు అతీతంగా సాగిందని జనార్ధన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు