పెరియార్ జయంతి వేడుకలు

17-09-2026 | 09:58pm

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): భారతదేశ చరిత్ర(History of India)లో వందేళ్ల క్రితమే సామాజిక న్యాయం(Social justice) కోసం పోరాడిన యోధుడిగా పెరియార్ చిరస్థాయిగా నిలిచిపోతాడని ఐక్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద పెరియార్ రామస్వామి నాయకర్(Periyar Ramaswamy Nayakar) 147వ జయంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులం పేరుతో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ఆయన కాంగ్రెస్ నుంచి బయటపడి జస్టిస్ పార్టీని స్థాపించాడన్నారు.

ఈ దేశ చరిత్రలో తొలిసారిగా బడుగు వర్గాల రిజర్వేషన్ చట్టం ఆయన కృషి ఫలితంగానే వచ్చిందని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ 1950లోనే మొదటి రాజ్యాంగ సవరణ సైతం ఆయన పోరాటాల కారణంగానే సాధ్యమైందన్నారు. పెరియార్ చేపట్టిన స్వాభిమాన ఉద్యమాల కారణంగానే.. 1967 లో బడుగు వర్గాలకు చెందిన అన్నాదురై దేశ చరిత్రలో తొలిసారి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారని, బడుగు వర్గాల రాజ్యాధికార ఆకాంక్షకు పెరియార్ ప్రతిరూపమన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర  ఉపాధ్యక్షులు దేవి పోచన్న, ఏ ఐ వై ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి లక్ష్మణ్, సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్ము రాజన్న, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు దేవి సత్యం, మానవ వికాస వేదిక జిల్లా కార్యదర్శి మాడిశెట్టి సత్యనారాయణ, సామాజిక ఉద్యమకారులు మోతె రామదాసు, యుగంధర్ సాయి, వేముల కిరణ్, సాయి కుమార్ గౌడ్,  షబ్బీర్ పాషా, పాటి రాజు, సురమల్ల రాంచందర్, రావిళ్ళ వర్షిత్, మంతెన రాయమల్లు, ఆవిడపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు