అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

17-09-2026 | 09:54pm

కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి

మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ కు వినతి 

మల్కాజిగిరి,(విజయక్రాంతి): అభివృద్ధి పనులకు నిధులు(development works funds ) మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి కోరారు. గురువారం ఆయన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Former MLA Mynampally Hanumantha Rao) ఆదేశాల మేరకు, మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్(Malkajgiri Zonal Commissioner Sanchit Gangwar) ఐఏఎస్ ని కలిసి పలు అభివృద్ధి పనులకు సంబంధించి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ధోబీఘాట్ అభివృద్ధి కోసం రూ 45 లక్షల నిధులు మంజూరు చేయాలని, అలాగే వాయుపురి కాలనీలో మిగిలిన అంతర్గత రోడ్లను నిర్మించాలని, భరణి కాలనీ లో మరో రహదారి నిర్మిం చాలని కోరారు. ఆయా అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను మంజూరు చేసి, ఈ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన జోనల్ కమిషనర్ ని కోరా రు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్. ఆర్. ప్రసాద్, ధోబీఘాట్ అధ్యక్షులు కృష్ణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు