నూతన భవనం- విరిగిన కుర్చీలు

12-10-2026 | 10:30pm

ముకరంపుర,(విజయక్రాంతి): సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం కరీంనగర్లో సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. సోమవారం ప్రజావాణి కార్యక్రమం(Prajavani Program) నూతన భవనంలో నిర్వహించారు. అయితే ప్రజల సౌకర్యార్థం సేద తీరేందుకు ఏర్పాటుచేసిన కుర్చీలు మాత్రం పాత కలెక్టర్ సముదాయంలో నుండి విరిగిపోయిన, వంగిన,  తుప్పు పట్టిన కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎంతో ఆర్భాటంగా నూతన హంగులతో నిర్మించిన భవనంలో ఈ పాత కుర్చీలు ఏంటని ప్రజావాణికి వచ్చిన ప్రజలు బాహాటంగా చర్చించుకున్నారు. ఇప్పటికైనా వీటి స్థానంలో నూతన ఫర్నిచర్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని  కోరారు.

మరిన్ని వార్తలు