శ్రీ సంత్ సేన మహారాజ్ జీవితం భక్తి, నిష్ఠ, సేవకు ప్రతీక

08-09-2026 | 08:12pm

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): శ్రీ సంత్ సేన మహారాజ్(Shri Sant Sena Maharaj) జీవితం భక్తి, నిష్ఠ, సేవకు ప్రతీక అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) కొనియాడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం(Nai Brahmin Service Association) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేన మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంత్ సేన మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చూపిన ఆధ్యాత్మిక, సామాజిక సేవా మార్గాలను స్మరించుకున్నారు. “నిజమైన భక్తితో భగవంతుడిని ఆశ్రయిస్తే, ఆ భక్తుడిని కాపాడేందుకు భగవంతుడు స్వయంగా వచ్చి నిలుస్తాడు” అనే గొప్ప సందేశాన్ని ఆయన జీవితం మనకు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు తుక్కారా0, అనిల్, ప్రసాద్, సత్యం, హనుమాన్లు, సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు