అటవీ భూములపై సమావేశం
22-09-2026 | 10:18pm
నిజాంసాగర్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామ అటవీ భూమీ 765 సర్వే నంబర్ పై ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు రావడంతో బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి(RDO Ravinder Reddy), మంగళవారం నాడు మల్లూరు గ్రామంలో రైతులతో సమావేశం అయ్యారు. త్వరలోనే సర్వే నిర్వహించి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామని ఆయన సూచించారు. ఫారెస్ట్ అధికారులు, సర్వే సిబ్బంది, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామస్తులతో చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంసాగర్ తాసిల్దార్ సాయిబుజంగారావు, అటవీశాఖ అధికారులు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.