కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
08-09-2026 | 07:45pm
తాడ్వాయి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapalli Shankar)పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కామారెడ్డి జిల్లా తాడువాయి పోలీస్ స్టేషన్(Taduvai police station)లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrasekhar Rao) మరణం కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చంద్ర రెడ్డి, గోపాల్ రావు, గంగారం తదితరులు పాల్గొన్నారు.