నూతన వధూవరులకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆశీస్సులు..

20-09-2026 | 07:45pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): సీనియర్‌ పాత్రికేయులు బిజ్జం వెంకటరామిరెడ్డి–మాజీ ఎంపీపీ నాగలక్ష్మి దంపతుల ప్రధమ కుమారుడు రామ్ సాయి సుమంత్‌ రెడ్డి–హేమలత రెడ్డి వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు హాజరు కాలేకపోయిన మాజీ ఎమ్మెల్యే, మాజీ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు (Former BRS District President Rega Kanta Rao)ఆదివారం తన సతీమణితో కలిసి బిజ్జం వెంకటరామిరెడ్డి స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుమంత్‌–హేమలత దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. అనంతరం బిజ్జం వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, విందులో పాల్గొన్నారు. రేగా కాంతారావుతో పాటు మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రెడ్డిపాలెం గ్రామ సర్పంచ్‌ బానోత్ సరోజ, బీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, పినపాక మండల మాజీ అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, దారం కృష్ణారెడ్డి, ఏసుబాబు, బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ నాయకుడు గుల్‌ మహమ్మద్‌, కె.వి.రమణ, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు