జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

21-09-2026 | 03:11pm
  1. సాగునీటి కోసం రైతుల నిరసన.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం
  2. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అరెస్ట్‌

ఆత్మకూరు, సెప్టెంబర్‌ 21: జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి(Former MLA of Makthal, Chittem Rammohan Reddy) సోమవారం జూరాల ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా ఆయకట్టు రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రైతులకు సాగునీటిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు