తెలంగాణ ఉద్యమకారుడికి సిరికొండ పరామర్శ
గణపురం, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోల రవి(Kolla Ravi) సతీమణి లక్ష్మి(Lakshmi) ఇటీవల అనారోగ్యంతో మరణించగా శుక్రవారం ఆమె దశదిన కర్మ కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి(Sirikonda Madhusudhanachary) హాజరయ్యారు. చెల్పూర్ గ్రామం(Chelpur Village)లో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొని, కోల లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శోకతప్తులైన కోల రవిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లక్ష్మి అకాల మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. తాము ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రత్నం రవి, రేపాక రాజేందర్, దొగ్గెల దేవేందర్, మేకల రజిత తదితరులు పాల్గొన్నారు.