బిట్స్ పాఠశాల చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి

12-10-2026 | 10:08pm

సహ చట్టం కార్యకర్త కుసుమ రామకృష్ణ

ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కు వినతి

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): భూపాలపల్లి పట్టణంలోని మహేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బిట్స్ పాఠశాల అధినేత డాక్టర్ ఏ రాజేంద్రప్రసాద్ పై క్రిమినల్ కేసులు(Criminal Cases) పెట్టాలని సమాచార హక్కు చట్టం కార్యకర్త కుసుమ రామకృష్ణ సోమవారం జరిగింది ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి(Additional Collector Vijayalakshmi)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ... భూపాలపల్లి పట్టణంలో చాలా సంవత్సరాలుగా మూతపడిన శాంతినికేతన్ విద్యాలయంను రెన్యువల్, బదిలీ చేయు సమయంలో తప్పుడు ధ్రువ పత్రాలు పెట్టి  బదిలీ చేశారు.

సదరు విషయమై రామకృష్ణ శాంతినికేతన్(Ramakrishna Shantiniketan)కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద అడుగగా శాంతినికేతన్ గుర్తింపును రద్దు చేసుకొని బిట్స్ పేరు మీద కొత్త ఫైల్ వేసి ఓపెనింగ్ పర్మిషన్ తీసుకోవడం జరిగిందని అదేవిధంగా శాంతినికేతన్ పాఠశాలకు సంబందించిన యూ డైజ్ లో ఉన్న విద్యార్థులకు సంబంధించిన ప్రవేశాలు భూపాలపల్లి బిట్స్ పాఠశాలలో నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈవిధంగా ప్రభుత్వాన్ని మోసం చేసిన బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ పై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు మహేశ్వర ఎడ్యుకేషనల్ సోసైటీ పేరుమీద ఉన్న బిట్స్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని రామకృష్ణ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు