గణపురంలో సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం

16-10-2026 | 10:38pm

వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్

గణపురం, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలను(Saddula Bathukamma Celebration) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Katkuri Radhika Srinivas) సంతవద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు.

మరిన్ని వార్తలు