నిలదీస్తే అరెస్టులా?

24-09-2026 | 01:15pm

కరెంటు కోతలపై నిలదీస్తే అరెస్టులా?

ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కే చర్యే

కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతును నొక్కుతుంది!

కాళేశ్వరం,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ(BRS Party) రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు(K.T.Rama Rao) పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పవర్ ప్లాంట్ల ముట్టడిపై మహాదేవపూర్ మండల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు నొక్కే చర్య లాంటిదేనని వారు అన్నారు. రైతులకు 24గంటల నిరంతర నాణ్యమైన కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం, రైతులను అరిగోసలు పెడుతుందని అన్నారు. కెసిఆర్ పాలనలో నిరంతర విద్యుత్ తో రైతు మొహంలో ఆనందం ఉండేదని, కేసీఆర్(KCR) పాలనలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఈ కరెంట్ కోతలు ఏంటని ప్రశ్నించారు.

సరిపడేంతా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్ లు ఉన్న,బొగ్గు నిల్వలు సరిపోవడం లేవని కుంటి సాకులు చెపుతున్నారని అన్నారు.ఖరీప్ పంటలకు సరిపడా నీరు ఉన్నా,కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రజలు మీకు అధికారమిచ్చింది రైతులను ఇబ్బంది పెట్టడానికేనా?  కాంగ్రెస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు నిరంతరంగా విద్యుత్ అందేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.ముందస్తు అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీపతిబాపు,కేదారి గీత, అలీం ఖాన్, కూరతోట శ్రీహరి,చిల్ల కుమార్, వెన్నంపల్లి మహేష్,రెవెల్లి రాజశేఖర్,ఇస్తియాక్, కడారీ రమేష్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు