దోమకొండలో 5 కోట్ల తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి ప్రణాళిక
జనగామలో డ్రైనేజీ పనులను పరిశీలించిన పాలకవర్గం
దోమకొండ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): దోమకొండ గ్రామంలో(Domakonda Village) రూ.5 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను(Underground Drainage System) ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు గ్రామ సర్పంచ్ ఐరేణి నరసయ్య(Village Sarpanch Aireni Narasayya) తెలిపారు. ఇందులో భాగంగా బీబీపేట మండలం జనగామ గ్రామంలో(Jangaon Village) నిర్మించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను శనివారం సర్పంచ్ ఐరేణి నరసయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్‌తో పాటు పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. జనగామ గ్రామంలో సుమారు 9 కిలోమీటర్ల మేర నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి, దోమకొండలో చేపట్టనున్న పనులపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నరసయ్య మాట్లాడుతూ.. దోమకొండలో మెయిన్ డ్రైనేజీ కందకాన్ని సీసీ నిర్మాణంతో, అంతర్గత డ్రైనేజీ పనులను పీవీసీ పైపులతో చేపట్టనున్నట్లు వివరించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో మంజూరైన రూ.3 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.కోటి, గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి మిగిలిన నిధులను సమకూర్చి మొత్తం రూ.5 కోట్లతో పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే గ్రామంలో మురుగునీటి సమస్యలు తగ్గి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా మెరుగైన పారిశుధ్య వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముత్యాల అమర్నాథ్, కటికె శ్రీనివాస్, బొర్రోళ్ల కొండల్‌రెడ్డి, పాలకుర్తి శేఖర్, దోమకొండ నర్సింలు, కూర సంతోష్, స్వామి, ఐరేణి రాజేందర్, పాత రాజు తదితరులు పాల్గొన్నారు.