ఉప్పల్‌ ఎక్స్‌రోడ్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల పోటాపోటీ నిరసనలు

08-09-2026 | 06:33pm

ఉప్పల్,(విజయక్రాంతి): కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల పోటాపోటీ నిరసనలతో ఉప్పల్‌ ఎక్స్‌రోడ్‌(Uppal X Road)లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరస్పరం వ్యతిరేక నినాదాలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌(Congress ) శ్రేణులు దిష్టిబొమ్మ దహనం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది.

సమాచారం అందుకున్న ఉప్పల్‌ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను(BRS) అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఘటన నేపథ్యంలో ఉప్పల్‌ ఎక్స్‌రోడ్‌ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు