సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ లపై కేసు నమోదు చేయాలి
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి
గణపురం,(విజయ క్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరణాన్ని కోరుతూ, హింసకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారంటూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇతర కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ కేసులు(Criminal cases) నమోదు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న కేసీఆర్(KCR)పై బెదిరింపులు, హింసకు ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సెప్టెంబర్ 8న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapally Shankar) చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలతో పాటు, గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లు ఆరోపణలు ఉన్న వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుని భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.