నేటితో గుర్తింపు కార్మిక సంఘాల గడువు పూర్తి

08-09-2026 | 07:30pm

ఇకనుండి అన్ని సంఘాలతో చర్చలు జరపాలి

అధికారిక కార్యక్రమాలకు ఏఐటీయూసి, ఐఎన్టీయూసీ నాయకులను పిలిస్తే ప్రతిఘటన తప్పదు: హెచ్ఎంఎస్

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల(Recognized labor unions) గడువు మంగళవారంతో పూర్తయినందున ఇకనుండి సింగరేణి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలతో సమస్యలపై చర్చించాలని హెచ్ ఎం ఎస్ నాయకులు సింగరేణి(Singareni) యాజమాన్యాన్ని కోరారు. సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని కేటీకె 1వ గనిలో హెచ్ఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ నరేష్ నేత అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించగా హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ, జేబిసీసీఐ సభ్యులు రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు, పెద్దపల్లి పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తిప్పారపు సారయ్య ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇప్పటి నుండి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలను ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించినా తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

గత 30 నెలల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కరించని సంఘాలు సమ్మె పేరుతో యాజమాన్యం దిగి వచ్చిందని చారిత్రకమైన అగ్రిమెంట్లు చేశామని తప్పుడు ప్రచారం చేసి కార్మికులను మరొకసారి మోసం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించామని తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్న ఏఐటీయూసీ, ఐ ఎన్ టీ యూ సీ సంఘాల మాటలను నమ్మవద్దని సూచించారు. స్వార్ధంగా కార్మికుల పక్షాన పోరాటం చేసే హెచ్ఎంఎస్ యూనియన్ ను ఈసారి ఆదరించి హక్కున చేర్చుకోవాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మల్లేష్, సహాయ కార్యదర్శి నర్సయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహంకాళి తిరుపతి, చంద్రశేఖర్, చుక్క రాజు, రాజుకుమార్, సిరాజ్, శివ క్రిష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు