తట్టి అన్నారంలో మహిళా దారుణ హత్య
- ఓయూ మాణిక్వేశ్వర్ నగర్ చెందిన మంగమ్మగా గుర్తింపు
- గత 28 న మిస్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్ ఇంచార్జి ఏసీపీ రవీందర్ రెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్: తట్టి అన్నారంలో మహిళా దారుణ హత్యకు గురై మృతదేహం లభ్యమైన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) మాణిక్యే శ్వర నగర్ కు చెందిన మంగమ్మ గత నెల 28 న మిస్సయినట్లు ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.
10 రోజుల తర్వాత మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) ఎల్బీనగర్ జోన్ నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట్ తట్టి అన్నారం (నాగోల్ బండ్లగూడ బస్ డిపో) వెనుక గోల్డెన్ లీవ్స్ విల్లాస్ వెళ్లే మార్గంలో మంగమ్మ చేతులు, కాళ్లను కుక్కలు చెల్లు చెదరం చేస్తుంటే మార్నింగ్ వాక్ కు వెళ్లేవాళ్లు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మధ్యం బాటిల్లు కనిపించాయి. ఎల్బీనగర్ ఇన్చార్జి ఏసీపీ రవీందర్ రెడ్డి, క్లూస్ టీం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళా మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మిస్సింగ్ అయిన మంగగా గుర్తింపు.. మృతిపై కూతురికి అనుమానాలు
నాగోల్, అక్టోబరు 7 విజయ క్రాంతి: నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన మార్నింగ్ వాకర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాగోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
28న ఇంటి నుంచి వెళ్లి.. మిస్సింగ్ ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
మృతురాలిని ఓయూ క్యాంపస్ సమీపంలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగ (46)గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 28న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మంగ తిరిగి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా తట్టి అన్నారం వద్ద లభించిన మృతదేహం మంగదేనని పోలీసులు గుర్తించారు.
మృతిపై అనుమానాలు పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు
తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని మంగ కుమార్తె జ్యోతి పోలీసులకు తెలిపింది. ఇద్దరు మహిళలపై తమకు అనుమానం ఉందని, వారిని విచారించాలని కోరింది. మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు ఉన్నట్లు సమాచారం.
అయితే మంగది హత్యేనని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణం వెల్లడవుతుందని చెప్పారు. మిస్సింగ్ కేసుతో మృతదేహం లభించిన ఘటనకు ఉన్న సంబంధంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.