సోమశిల కృష్ణ నదిలో గుర్తు తెలియని శవం లభ్యం..
18-10-2026 | 07:47pm
కొల్లాపూర్ అక్టోబర్ 18: నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool district) కొల్లాపూర్ మండల కేంద్రంలోని సోమశిల కృష్ణా నది రివర్ లో అలలకు గుర్తు తెలియని శవం గాలికి కొట్టుకు వచ్చిందని సోమశిల సర్పంచ్ కాటం వెంకట్ లక్ష్మి, కొల్లాపూర్ ఎస్సై ఆనందకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. కృష్ణా నదిలో గుర్తుతెలియని శవం నదిలో తేలడం చూసి ఒక్కసారిగా గ్రామస్తులు భయం ఆందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని కొల్లాపూర్ ఎస్సై తెలిపారు.