ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

16-10-2026 | 11:36am

కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool district) కొల్లాపూర్ మండల పరిధిలోని జాతీయ రహదారి 167పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం(road accident)లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొల్లాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా నుంచి ఐదు డీసీఎంలలో సుమారు 14 లక్షల చేప పిల్లలను సింగోటం శ్రీహరి సముద్రంలో విడిచిపెట్టేందుకు తీసుకువస్తున్నారు.

ఈ క్రమంలో అంకిరావుపల్లి స్టేజీ సమీపంలో నిద్రమత్తులో ఉన్న ఓ డీసీఎం డ్రైవర్ వేగంగా వచ్చి, ముందు వెళ్తున్న మరో డీసీఎంను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఏలూరు జిల్లాకు చెందిన రాము (52) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిలో ఒకరిని హైదరాబాద్‌కు, మరొకరిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రాముకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు