సెలవులపై ఇంటికొచ్చి.. మృత్యుఒడికి
బోధన్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవతే రక్షిత్ రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతి చెందాడు. భారత ఆర్మీలో జనరల్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న రక్షిత్ అక్టోబర్ 12 నుంచి నెల రోజుల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగియడంతో స్నేహితులతో కలిసి బోధన్ పట్టణానికి వెళ్లిన ఆయన, రిలయన్స్ పెట్రోల్ బంక్ (Petrol Bunk) సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు (Police Case) చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీ జవాన్ మృతితో అమ్డాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న జవాన్ మృతి చెందడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.