ఊపిరితిత్తుల ఆరోగ్యం.. మన చేతుల్లోనే!

28-09-2026 | 05:34pm

ఆధునిక జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం ఊపిరితిత్తు(Lung)ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. సిగరెట్‌, బీడీ, హుక్కాతో పాటు సెకండ్‌హ్యాండ్‌ స్మోక్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో దుమ్ము, బూజు, వంట పొగ లేకుండా చూసుకోవడంతో పాటు సరైన వెంటిలేషన్‌ ఉండాలి. నడక, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు చేయాలి. కాలుష్యం అధికంగా ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు ఉండకూడదు. దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, ఛాతీ నొప్పి లేదా దగ్గుతో రక్తం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


మరిన్ని వార్తలు