లైఫ్‌స్పాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మళ్లీ ఈషా సింగ్

27-10-2026 | 05:05am

భారత షూటింగ్ స్టార్‌తో ఒప్పందాన్ని పొడిగించిన సంస్థ

హైదరాబాద్, అక్టోబర్ 26(విజయక్రాంతి): హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ(Health and Wellness Organization) లైఫ్‌స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ భారత ప్రముఖ పిస్టల్ షూటర్ ఈషా సింగ్‌తో(Eisha Singh) తన బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador) ఒప్పందా న్ని పొడిగించినట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సంస్థ నిర్ణయించింది. భారత షూటింగ్ క్రీడల్లో(Indian shooting sport) ప్రతి భావంతమైన క్రీడాకారిణిగా గుర్తింపు పొంది న ఈషా సింగ్, తన క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదలతో పోటీల్లో రాణిస్తున్నారు.

క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే తపన లైఫ్‌స్పాన్ విలువలకు అనుగుణంగా ఉన్నాయని సంస్థ తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా క్రీడాకారులతో అనుబంధాన్ని బలోపేతం చేయడం తో పాటు ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది. లైఫ్‌స్పాన్‌తో తన అనుబంధం కొనసాగుతుండటంపై ఈషా సింగ్ సం తోషం వ్యక్తం చేశారు. గత కొ న్నేళ్లుగా సంస్థతో తన ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగిందన్నారు.

ఆరోగ్యం, వెల్‌నెస్, స్పోర్ట్స్, న్యూట్రిషన్ రంగాల్లో లైఫ్‌స్పాన్ లక్ష్యాలకు తన వంతు సహకారం అందిస్తూ, ఈ భాగస్వామ్యంలో మరింత చు రుకైన పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా లైఫ్‌స్పా న్ వ్యవస్థాపకులు, సీఎండీ డాక్టర్ నరేంద్ర రామ్ నంబులా మాట్లాడుతూ, ఈషా సింగ్ తో మా అనుబంధాన్ని పొడిగించడం ఎంతో సంతోషంగా ఉంది..

గత కొన్నేళ్లుగా ఆ మె లైఫ్‌స్పాన్ కుటుంబంలో ఒక ముఖ్యమై న భాగంగా కొనసాగుతూ, మా సంస్థ విలువలకు గర్వకారణంగా నిలిచారు. ఆమె క్రమ శిక్షణ, ఏకాగ్రత, అత్యుత్తమ ప్రతిభను సాధించాలనే అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయ కం. ఆమె మాతో కలిసి ఈ ప్రయాణాన్ని కొ నసాగించేందుకు అంగీకరించడం ఆనందం గా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నాం అని అన్నారు.

మరిన్ని వార్తలు