హత్యాయత్నం కేసును చేదించిన పోలీసులు

03-10-2026 | 07:14pm

ఐదుగురుపై కేసు నమోదు 

వివరాలు వెల్లడించిన డిఎస్పి సతీష్ కుమార్ 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణంలో గత నెల 7వ తేదీన స్థానిక కనకదుర్గ బారు వద్ద జరిగిన హత్యాయత్నం కేసును(Attempted murder case) పాల్వంచ పట్టణ పోలీసులు ఛేదించారు. హత్యాయత్నం కుట్రపూరితంగా ఉందని, ఐదుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సతీష్ కుమార్(DSP Satish Kumar) వెల్లడించారు. శనివారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో(Palvancha Town Police) ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ హెచ్ 9 మన పూరి ప్రభాకర్ పై జరిగిన దాడి కేసులో గత నెల 10 తేదీన అరవ వినయ్ కుమార్ ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా కాల్ డేటా రీకార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలు, తన సాంకేతిక ఆధారాలతో మరికొందరు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో పాల నాగేశ్వరరావు, ప్రభాకర్ వద్ద రూ 30 లక్షలు తప్పుగా తీసుకున్నట్టు తెలిపారు. అప్పు తిరిగే ఇవ్వాలని ప్రభాకర్ ఒత్తిడి చేయడంతో అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించాలని తెలిసింది. ఈ క్రమంలో కొత్తగూడెంకు చెందిన దాసరి రాజును సంప్రదించారు. రాజు సూచన మేరకు ఆరవ వినయ్ కుమార్ ను సంప్రదించి రూ 5 లక్షల ఖర్చు అవుతుందని ఒప్పందం కుదుర్చుకున్నారు.

అనంతరం వినయ్ కుమార్ తన స్నేహితులైన ఎలగడ్డ శివకృష్ణ, డాకూరి గణేషులతో పధకం రూపొందించినట్లు విచారణలో వెళ్లడైందన్నారు. పథకం అమలుకు నాగేశ్వరరావు రాజుకు రూ 2లక్షలు అడ్వాన్స్ చెల్లించినట్లు వెళ్లడైందన్నారు. అప్పటినుంచి ప్రభాకర్ కదలికలపై నిందితులు ముందుగానే గమనించి అనుమైన సమయం కోసం వేచి ఉన్నారు. దాడి జరిగిన రోజున ప్రభాకర్, నాగేశ్వరరావు లు కనకదుర్గ బార్లో కలిసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అదేరోజు సాయంత్రం 7గంటలకు ప్రభాకర్ కు నాగేశ్వరరావు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించాడు, కనకదుర్గ బార్ దగ్గర ఉన్నానని చెప్పడంతో అక్కడే ఉండమని సూచించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభాకర్ కదలికలను రాజుకు చేరవేయడంతో ఎలగడ్డ శివకృష్ణ, డాకూరి గణేష్, ఆరవ వినాయకుమారులతో కనకదుర్గ బారు వద్దకు చేరుకొని ప్రభాకర్ బయటకు వచ్చే సమయంలో సోడా సీసా తో దాడికి పాల్పడ్డారని తెలిపారు. హత్యాయత్నం జరిగిన వెంటనే నిందితుడు నాగేశ్వరరావు పరారీ కావడంతో పోలీసులకు అనుమానం బలపడింది.

తీవ్ర గాయాలతో దాడి నుంచి తోటిలో తప్పించుకున్న ప్రభాకర్ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ అసలు సూత్రధారులను తేల్చి తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారీనట్లు డిఎస్పి వెల్లడించారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు తెలిపారు. హత్య చేసేందుకు కుట్రగు పాల్పడిన పాల నాగేశ్వరరావు సుపారి గ్యాంగ్ సభ్యులు దాసరి రాజు వినయ్ గాని శివ లను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి  తెలిపారు.

మరిన్ని వార్తలు