గణపతి నవరాత్రి ఉత్సావాల సందర్భంగా మొహాన్న దాన కార్యక్రమాలు

21-09-2026 | 02:49pm

ఆళ్ళపల్లి సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల వద్ద మహా అన్నదాన కార్యక్రమాలు(Maha Annadana programs) ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మండల కేంద్రంలోని రామాలయం వద్ద ప్రముఖ వ్యాపారస్తులు గౌరిశెట్టి నాగభూషణరావు భారతమ్మ దంపతులు అలాగే భగత్ గ్ నగర్ మండపం వద్ద వ్యాపారస్తులు అబ్బు నాగేశ్వరరావు జానకమ్మ దంపతులు అలాగే కొమ్ముగూడెం మండపం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రామాలయ ఉత్సవ కమిటీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

మర్కోడు గ్రామంలో వ్యాపారస్తులు తాళ్లపల్లి రామ్మూర్తి, తాళ్లపల్లి నవీన్  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాల ప్రారంభోత్సవానికి స్థానిక సర్పంచులు వాసం సుష్మిత, సుతారి రమాదేవి ఉపసర్పంచ్ ఆరిఫ్, వగలబోయిన సతీష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్ యూత్ అధ్యక్షులు శ్రీనాథ్ స్థానిక ఎస్సై ఎం సోమేశ్వర రావు, గ్రామ పెద్దలు స్థానిక వ్యాపారులు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు