భగీరద నీళ్లు రోడ్లపాలు
భద్రత మరిచిన ప్రజలు
ఇష్టానుసారంగా రోడ్లపై వదులుతున్న దుకాణ యజమానులు
నీటి వృధాను అరికట్టలేని నగరపాలక సంస్థ
ప్రజల్లో అవగాహన లోపమే కారణమా
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం(Kothagudem) పట్టణంలోని రామవరం ప్రాంతంలో గతంలో, మిషన్ భగీరథ(Mission Bhagiratha water) పేరిట రోడ్లు పూర్తిగా ధ్వంసం చేసి, పైపులైన్లు వేసిన అనంతరం ప్రతి దుకాణదారునికి, ఇంటికి భగీరథ కనెక్షన్ ఇవ్వడంతో సరి అనుకున్నారో ఏమో! దాని సంరక్షణ పట్ల అవగాహన మరిచిన యజమానులు, సరిగ్గా వాడక నీరు వృధాగా రోడ్లపై పారుతూ సెలయేర్లను తరిపిస్తుంది. ప్రతి నీటి బొట్టును, ఒడిసి పడదాం భావితరాలకు భవిష్యత్తునిద్ధం... అన్న ప్రకటనలు, ప్రకటనల కే పరిమితమైనట్టుంది.
బాధ్యత లేని యువత అవగాహన రాహిత్యంతో నీటిని వృధా చేయడం సరికాదు. భావితరాలకు నీటి కొరతను తెచ్చి పెట్టిన వాళ్ళవుతారు. ఇది కేవలం ప్రజల్లో అవగాహన లోపం అనీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకపక్క రోడ్లన్నీ మిషన్ భగీరథ పేరిట చిద్రం చేసి,ఇంకోపక్క నీటిని కట్టడి చేయకుండా, యజమానులు రోడ్లపై వదిలేయడం అత్యంత హేయమైన చర్యగా పరిగణలోకి తీసుకోవాలని, దీని వల్ల పూర్తిగా రోడ్లపై నీరు పారి వాహనదారులకు, పాదాచారులకు, ఎంతో ఇబ్బందికరంగా ఉంటు పలు సంఘటనలు జరిగే అవకాశం లేకపోలేదు.
దీనిపై తక్షణమే నగరపాలక సంస్థ స్పందించి, ఎవరైతే నీటిని వృధా చేస్తున్నారో వారందరికీ నోటిసులిచ్చి,వారి కనెక్షన్ తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి వృధాను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను చేపడుతూ ఉంటే,ఇంకోప్రక్క ప్రజలు,బాధ్యత రహితంగా ప్రవర్తించడం పలువురిని సందేహం లోకి నెట్టేస్తుంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే,దీనిపై కూడా ఉద్యమాలు చేపట్టే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ప్రజా పరిరక్షణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, పాఠకులు.