ఎల్ నినో ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొనాలి

17-10-2026 | 03:13pm

ప్రతి ఒక్కరూ నీటి పొదుపులో పాటించాలి

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి):  ఎల్ నినో ప్రభావాన్ని(impact of El Niño) ఎదుర్కొనేందుకు  ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ఈ ప్రభావాన్ని  ఎదురుకునేందుకు  సమిష్టిగా కృషి చేయాలని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శనివారం ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో 59 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న మహిళలు ఉద్దేశించి  మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ నీటి పొదుపులో పాటించాలని, అందుకు ప్రభుత్వం తరఫున నిర్మించే  ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచనలు చేశారు.

రాబోయే కాలంలో నీటి కొత్త తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని , నీటి కొరతను ఎదుర్కొనేందుకు  ఇప్పటినుండే పొదుపు పాటించాలని  సూచనలు చేశారు. అనంతరం చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  రైస్ ఉల్లా, తహసిల్దార్  కోట్ల రఘునాథరావు, సర్పంచ్ అనిత శ్రీనివాస్  జాదవ్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు