ఇందిరమ్మ 12 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు
దోమకొండ, అక్టోబర్ 17 (విజయక్రాంతి): దోమకొండ మండలంలో(Domakonda Mandal) ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు(Beneficiaries of Indiramma houses) విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) చర్యలు చేపట్టారు. మండల పరిధిలో 12 ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు అందజేశారు. ఇందుకోసం విద్యుత్ స్తంభాలు(Electricity poles) ఏర్పాటు చేసి, మీటర్లు బిగించి సరఫరాను అందుబాటులోకి తెచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల నిర్మాణంతో పాటు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొంటున్నారు. దోమకొండ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యుత్ శాఖ సిబ్బంది పనులు పూర్తి చేశారు. లైన్మెన్లు శంకర్, సదానందం, నవీన్, వేణు తదితరులు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, మీటర్ల బిగింపు, కనెక్షన్ల మంజూరు పనుల్లో పాల్గొన్నారు.