కాయకల్ప్ అవార్డ్స్‌ లో వైద్య శాఖ ప్రతిభ

17-10-2026 | 04:40pm

- కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): కాయకల్ప్‌ అవార్డ్స్‌(Kayakalp Awards) 2025–26 కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(Mancherial District Medical and Health Department) ఘన విజయాన్ని సాధించిందని కలెక్టర్ కుమార్ దీపక్(Kumar Deepak) అన్నారు. శనివారం తన ఛాంబర్ లో టి.వి.వి.పి. వైద్యాధికారులను శాలువాతో సన్మానించి, మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాయకల్ప్‌ అవార్డ్స్‌ 2025–26 కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి(Bellampalli Area Hospital) రన్నరప్‌గా నిలిచి రూ. 10 లక్షల నగదు బహుమతిని గెలుచుకోగా, చెన్నూర్ ఏరియా ఆసుపత్రి, లక్షెట్టిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ లు కమెండేషన్ అవార్డులతో పాటు ఒక్కొక్కటి లక్ష రూపాయల నగదు బహుమతిని సాధించాయని తెలిపారు.

ఆసుపత్రులలో పారిశుధ్యం, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రి నిర్వహణ ప్రమాణాల మెరుగుదలకు వైద్యులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ విజయంలో 3 ఆసుపత్రుల పర్యవేక్షకులతో పాటు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కృషి అభినందనీయమని తెలిపారు.

ఆసుపత్రులలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పర్యవేక్షకులు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు