ఉపాధ్యాయుల దీక్షకు టీఎస్‌యూటీఎఫ్‌ భారీ మద్దతు

17-10-2026 | 04:45pm

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్‌

ఏన్కూరు, అక్టోబర్ 17 విజయక్రాంతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలకు(Educational policies) వ్యతిరేకంగా స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(School Teachers' Federation of India) (ఎస్‌టీఎఫ్‌ఐ) పిలుపు మేరకు టీఎస్‌యూటీఎఫ్‌(TSUTF) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన ఉపాధ్యాయుల సామూహిక నిరాహార దీక్షకు ఏన్కూరు మండలం నుంచి నాయకులు భారీగా తరలివెళ్లారు. విద్యారంగ(Education Sector), ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని(Old Pension System) పునరుద్ధరించాలని, అర్హులైన ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌(TET) నుంచి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాలల విలీనం, మూసివేతను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు.పెండింగ్‌ డీఏలు, బిల్లులను విడుదల చేయాలని, తెలంగాణ రెండో పీఆర్సీ అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలని, పండిట్‌, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి డీఎస్‌. నాగేశ్వరరావు నాయకత్వంలో మండల అధ్యక్షుడు బి. రామ్‌ చంద్‌, ప్రధాన కార్యదర్శి మూడ్‌ పుల్లయ్యతో పాటు నాయకులు బి. రాందాస్‌, కే. విజయ్‌ కుమార్‌, బి. కేశ్యా, సర్వర్‌, ఎల్లయ్య, శ్యాం కుమార్‌, శ్రీదేవి, శంకరరావు, సింగ్య, రమేష్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు