మహాత్ముడు కన్న కలలు మనం నిజం చేయాలి
బోథ్,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ కన్న కలలు మనం నిజం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ(Market Committee Chairman Mallepula Satyanarayana) పేర్కొన్నారు. గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా మార్కెట్ కమిటీ ఆవరణలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ రామ స్వరాజ్యం కోసం కలలు కన్నారన్నారు.
ఆదిశగా మనందరం కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సత్యం అహింస మార్గాలను అనుసరించి నడిచిన గొప్ప మహానీయుడు అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వార్డు సభ్యులు షాకీర్ కౌసర్ గిరీష్ శేఖర్ శ్రీకాంత్ రెడ్డి పొన్నాల సేమేందర్ రెడ్డి, సందీప్, భీమ బుచ్చన్న, రవి, అమీరుద్దీన్ ,జగన్ ,హసీఫ్ రాజేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.