నొప్పి లేని రొమ్ము గడ్డలను నిర్లక్ష్యం చేయొద్దు

23-10-2026 | 05:00am

కేర్ హాస్పిటల్స్ వైద్యులు

రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా మహిళలకు సూచనలు

హైదరాబాద్, అక్టోబర్ 22(విజయక్రాంతి): రొమ్ములో గడ్డ ఏర్పడినా నొప్పి లేకపోవడంతో చాలామంది మహిళలు దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. క్యాన్సర్ అని తేలితే ఏమవుతుందోనన్న భయం, సమాజంలో ఉన్న అపోహలు, రొమ్మును పూర్తిగా తొలగించాల్సి వస్తుందనే ఆందోళనతో వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తున్నారు. ఈ జాప్యం వ్యాధిని తొలిదశలో గు ర్తించే అవకాశాలను తగ్గిస్తోందని కేర్ హాస్పిటల్స్(Care Hospitals) క్యాన్సర్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అక్టోబర్ నెలను ప్రపంచవ్యా ప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘ప్రతి ఒక్కరి కథ ప్రత్యేకం.. ప్రతి ప్రయాణం ముఖ్యం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, సకాలంలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్స అందించడం, మానసికంగా అండగా నిలవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలు. ముఖ్యంగా భయం, సామాజిక అపోహలు, వైద్యసేవలు పొందడంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాల్సిన అవస రాన్ని వైద్యులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌పై అవగా హన పెంచాల్సిన అవసరాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్2026లో పేర్కొన్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం, సర్వే నిర్వహించిన కాలంలో రాష్ట్రంలోని 30 నుంచి 49 ఏళ్ల మహిళల్లో కేవలం 0.3 శా తం మంది మాత్రమే రొమ్ము క్యాన్సర్ గుర్తిం పు కోసం పరీక్ష చేయించుకున్నట్లు వెల్లడైంది.మహిళల్లో అవగాహన పెంచడంతో పాటు అవసరమైన పరీక్షలు, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్  సర్జికల్ ఆంకాలజీ, ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ అండ్ ఉమెన్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాము దాములూరి మాట్లాడుతూ  రొమ్ములో ఏర్పడే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చిన ప్రతి మహిళకూ రొమ్మును పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉండదు. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే, రోగి పరిస్థితిని బట్టి రొమ్మును సంరక్షించే శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంటుంది. మహిళలు రొమ్ము ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎలాంటి భయం, సంకోచం లేకుండా వైద్యులతో చర్చించాలి’ అని సూచించారు.

కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బీఎంటీ ఫిజీషియన్ డాక్టర్ ఎ. వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘రొమ్ము క్యాన్సర్ వస్తే నయం కాదని, ప్రతి రోగికీ తప్పనిసరిగా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. క్యాన్సర్ రకం, వ్యాధి దశను బట్టి చికిత్సను నిర్ణయిస్తాం. తొలిదశలో గుర్తించిన అనేక మంది మహిళలకు వ్యాధిని పూర్తిగా నయం చేయాలనే లక్ష్యంతో చికిత్స అందించే అవకాశం ఉంది. చికిత్సపై భయం లేదా సామాజిక అపోహల కారణంగా వైద్యులను సంప్రదించడం ఆలస్యం చేయకూడదు. ముందుగానే గుర్తిస్తే మరిన్ని చికిత్సా మార్గాలను పరిశీలించవచ్చు. కొన్ని సందర్భాల్లో చికిత్స సంక్లిష్టతను కూడా తగ్గించవచ్చు” అని వివరించారు. 

 డాక్టర్ రాము దాములూరి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ, ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ అండ్ ఉమెన్ క్యాన్సర్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

మరిన్ని వార్తలు