క్విజ్‌, స్పెల్‌బీ విజేతలకు జిల్లాస్థాయి పోటీలకు పాల్గొనే అవకాశం

27-09-2026 | 12:16am

నేరేడుచర్ల మండల విద్యాధికారి ఎం.బాలు

నేరేడుచర్ల,సెప్టెంబర్26(విజయ క్రాంతి): పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM SHRI Zilla Parishad High School) నేరేడుచర్లలో(Nereducherla) విద్యార్థులకు క్విజ్‌, స్పెల్‌బీ పోటీలను నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మండల విద్యాధికారి ఎం.బాలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగాఎంఈఓ ఎం.బాలు మాట్లాడుతూ.. క్విజ్‌, స్పెల్‌బీ వంటి పోటీలు విద్యార్థుల్లో పుస్తక పరిజ్ఞానంతోపాటు వర్తమాన అంశాలు, సమకాలీన సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుతాయని తెలిపారు.

సాధారణ జ్ఞానం, పదజాలం, ఆలోచనా సామర్థ్యం, సమయస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.విద్యార్థులు చదువుతోపాటు వివిధ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు