బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఐలమ్మకు ఘన నివాళులు

26-09-2026 | 11:49pm

27న హనుమకొండలో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని పిలుపు 

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి): చాకలి ఐలమ్మ(Chakali Ilamma) గారి జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ(Chakali Ilamma) విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవిందర్, జిల్లా కో కన్వీనర్ జోగుల సమ్మయ్య మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ ఆశయాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మాత్రమే కొనసాగిస్తుంది అన్నారు.

ధర్మ సమాజ్ పార్టీ(Dharma Samaj Party) మద్దతుతో జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం రాజ్యాధికార సాధనకై ఈనెల 27 ఆదివారం రోజున హనుమకొండ హంటర్ రోడ్ డి కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్న ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా బహిరంగ పంచాయతీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు