విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
నారాయణపేట్ జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలి
వైస్ చైర్‌పర్సన్ భాగ్యశ్రీ శంకర్ రెడ్డి
మద్దూరు: మండల పరిధిలోని రెనివట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) శనివారం ప్రభుత్వంచే పంపిణీ చేసిన ఏకరూప దుస్తులను మద్దూరు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి భాగ్యశ్రీ శంకర్ రెడ్డి(Bhagyashree Shankar Reddy) విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఏకరూప దుస్తులతో పాటు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, షూస్ అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతూ చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మహమూద్, కృష్ణవేణి శ్రీనివాస్, శంకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జనార్దన్,అశోక్ గౌడ్, శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్, ఉపాధ్యాయులు వీరయ్య, బాలరాజు, బ్రహ్మయ్య, సాయి కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.