హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

26-09-2026 | 11:51pm

కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమీషనర్(Telangana Food Safety Commissioner) ఆదేశాల మేరకు శనివారం  కామారెడ్డి, భిక్నూర్ ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, FSSAI లైసెన్స్ / రిజిస్ట్రేషన్ లేకుండా ఆహార వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించారు.

 FSSAI లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారికి, పరిశుభ్రత పాటించని వారికి నోటీసులు జారీ చేశారు.ఆహారంలో వాడేందుకు నిల్వ ఉంచిన సింథటిక్ ఫుడ్ కలర్స్ ను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అనుమానిత ఆహార శాంపిల్స్ సేకరించి విశ్లేషణ నిమిత్తం స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, నాచారంకు పంపినట్టు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు