ఘట్ కేసర్ డివిజన్ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని
ఎంఎంసి కమిషనర్ కు వినతి
ఘట్ కేసర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ డివిజన్(Ghatkesar Division) ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్(Medchal District Congress President Thotakura Vajresh Yadav) ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శనివారం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి(Malkajgiri Municipal Corporation Commissioner Vinay Krishna Reddy) ని వారి కార్యాలయం లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఘట్కేసర్ డివిజన్ లో 32 అభివృద్ధి పనుల కోసం రూ. 32 కోట్ల 46 లక్షలు రూపాయలను మంజూరు చేయాలని డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ ను కలిసిన వారిలో ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ ఉన్నారు.